logo

స్త్రీ నిధి బకాయిల వసూళ్లకు చర్యలు

గత కొంతకాలం నుంచి స్త్రీనిధి రుణాల వాయిదాలు సరిగా జమకావడం లేదు. ఎన్పీఏ (బ్యాంకు పరిభాషలో రాని బాకీలు) పెరుగుతున్నాయి.

Published : 19 Jun 2024 01:54 IST

దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్‌టుడే: గత కొంతకాలం నుంచి స్త్రీనిధి రుణాల వాయిదాలు సరిగా జమకావడం లేదు. ఎన్పీఏ (బ్యాంకు పరిభాషలో రాని బాకీలు) పెరుగుతున్నాయి. దీంతో అధికారులకు కొంత ఇబ్బందికరంగా మారింది. పొదుపు సంఘాల మహిళలకు టంచనుగా రుణాలిస్తూ వాటిని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించి వెంటనే వాయిదాలను చెల్లించేలా చూడాలని అధికారులు ఎప్పటికప్పుడు చెపుతున్నారు. అప్పు తీసుకున్న వారు కట్టేందుకు దూరంగా ఉన్న బ్యాంకుకు వెళ్లి, పనిదినం వృథా చేసుకోవద్దని ఫోన్‌పే అకౌంట్‌నూ అందుబాటులోకి తెచ్చారు. ఇన్ని వసతులు కల్పించినా సొమ్ములు సరిగా జమకాకపోవడంపై అధికారులు ఆరాతీయగా, సొమ్ము దుర్వినియోగమైందని తెలిసింది. వీటి వసూళ్ల నేపథ్యంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు ఈ నెల 20న (గురువారం) బాధ్యులతో సమావేశం నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా పలు సందర్భాల్లో బకాయిలు చెల్లించాలని గట్టిగా హెచ్చరించినా దుర్వినియోగం చేసిన బాధ్యులు అంతగా స్పందించలేదని సమాచారం. రాని బాకీలతో సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపరు. దీంతో టంచనుగా వాయిదాలు చెల్లించిన వారికి అప్పు పుట్టని పరిస్థితి నెలకొందని ఒక అధికారి చెప్పారు. గురువారం దీనిపై స్పష్టత రానుందని సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని