logo

‘గుడ్డు’మాటల మంత్రికి గడ్డు కాలం

ప్రతిపక్షాలపై ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌పై విమర్శలకు మాత్రమే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పనిచేశారు. మంత్రిగా పారిశ్రామిక రంగం, ఐటీ రంగంపై ఎలాంటి ముద్ర వేయలేదు.

Published : 05 Jun 2024 07:13 IST

ప్రతిపక్షాలపై ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌పై విమర్శలకు మాత్రమే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పనిచేశారు. మంత్రిగా పారిశ్రామిక రంగం, ఐటీ రంగంపై ఎలాంటి ముద్ర వేయలేదు. పైగా పెట్టుబడులు ఏవని అడిగితే ‘కోడి గుడ్డు’ కథలు చెప్పి... గుడ్డు మంత్రిగా ముద్ర వేసుకున్నారు. ఇంత చేసినా జగన్‌ అమాత్యుని సీటు గాల్లో పెట్టి చివర్లో గాజువాక నుంచి పోటీకి అవకాశం ఇచ్చారు. ఇక్కడ ప్రధాన సమస్యగా ఉన్న స్టీలు ప్లాంటుపై రాజకీయం చేసేందుకు యత్నించి చతికిలబడ్డారు. అధికారంలోకి వచ్చాక ఉక్కు కార్మిక నేతలకు జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. ఎన్నికల వేళ మాత్రం అమర్‌నాథ్‌ వారిని జగన్‌ వద్దకు తీసుకువెళ్లారు. అయితే స్టీలు ప్లాంటు సమస్యలపై మాట్లాడకుండా... వామపక్షాల అభ్యర్థిని పోటీ నుంచి విత్‌డ్రా చేయించి, అమర్‌కు ప్రతి వార్డులో మెజార్టీ వచ్చేలా చూడాలంటూ చెప్పుకొచ్చారు. ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు దీనిపై గుర్రుగా ఉండటం మంత్రి గుడ్డు పగలడానికి ఓ కారణం. మరోవైపు వైకాపాలో అంతర్గత విభేదాలు భారీ వ్యత్యాసంతో ఓటమికి కారణమయ్యాయి. టికెట్‌ ఆశించి భంగపడిన నాగిరెడ్డి వర్గం, చందు, మేయర్‌ వర్గాలు ఎన్నికల సమయంలో పట్టీపట్టనట్లు ఉన్నాయి. తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు భారీ మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని