logo

చరిత్ర తిరగరాసిన పంచకర్ల

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండున్నర నెలల ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు.

Published : 05 Jun 2024 06:51 IST

81,870 ఓట్ల మెజారిటీతో గెలుపు
పెందుర్తిలో కూటమికే పట్టం కట్టిన ఓటర్లు

పెందుర్తి, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రెండున్నర నెలల ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. ఓట్ల లెక్కింపులో భాగంగా రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. అయిదు దశాబ్దాల పెందుర్తి నియోజకవర్గం చరిత్రలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు కొత్త చరిత్రను లిఖించారు. నియోజకవర్గం నుంచి రెండో సారి గెలిచిన అభ్యర్థిగా నిలిచారు. గతంలో ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి రెండో సారి గెలిచిన దాఖలాలు లేవు. ఆ సెంటిమెంటుకు పంచకర్ల ముగింపు పలికారు. జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచిన పంచకర్ల రమేశ్‌బాబు భారీ స్థాయి మెజారిటీతో సమీప ప్రత్యర్థి అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌పై రికార్డు స్థాయిలో 81,870 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. పంచకర్ల అద్వితీయ విజయంతో కూటమి నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పెందుర్తిలోని తెదేపా కార్యాలయంలో నాయకులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు తినిపించుకుని వేడుక చేసుకున్నారు. ఎల్‌ఈడీ తెరపై ఫలితాల సరళిని తిలకించారు. లెక్కింపు ప్రారంభం నుంచి కూటమి అభ్యర్థుల మెజారిటీ పెరుగుతూ పోవడంతో కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

నగరంలోని నివాసం వద్ద అభిమానుల మధ్య విజయ చిహ్నం చూపుతున్న పంచకర్ల 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని