logo

నేడు తేలనున్న భవితవ్యం

ఎన్నికల సంగ్రామంలో విజయం ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలనుంది.

Published : 04 Jun 2024 01:33 IST

సోంపేట, న్యూస్‌టుడే: ఎన్నికల సంగ్రామంలో విజయం ఎవరిని వరించనుందో కొన్ని గంటల్లో తేలనుంది. 2014, 2019లలో విజయం సాధించిన తెదేపా అభ్యర్థి బెందాళం అశోక్‌.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని కృషి చేయగా, తొలిసారి విజయం సాధించాలని వైకాపా అభ్యర్థి పిరియా విజయ ప్రచారం చేశారు. కాంగ్రెస్‌తో పాటు మొత్తం 9 మంది రంగంలో ఉన్నప్పటికీ తెదేపా, వైకాపాల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు కవిటి మండలానికి చెందినవారు కావడం విశేషం. జనసేన, భాజపా కలిసి రావడంతో మంచి మెజారిటీతో మూడోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని తెదేపా వర్గీయులు.. ఇచ్ఛాపురంలో వైకాపా జెండా ఈ సారి ఎగురవేస్తామని వైకాపా శ్రేణులు ధీమాతో ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో ఇచ్ఛాపురం పురపాలకసంఘంతో పాటు సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి మండలాలున్నాయి. ఇక్కడ 2,68,202 మంది ఓటర్లుండగా అందులో 1,30,751 మంది పురుషులు, 1,37,434 మంది మహిళలు 17మంది ఇతరులున్నారు. 299 పోలింగ్‌స్టేషన్‌లుండగా 14 టేబుళ్ల ద్వారా 22 రౌండ్లు లెక్కింపు జరగనుంది.

మహిళల ఓట్లే కీలకం ..

పలాస, న్యూస్‌టుడే: పలాస నియోజవర్గంలో కూటమి అభ్యర్థిగా గౌతు శిరీష, వైకాపా అభ్యర్థిగా సీదిరి అప్పల రాజు బరిలో ఉండగా మరి కొంత మంది పోటీ చేశారు. పలాస నియోజకవర్గంలో పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం, పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలంలో 1,07,278 మంది పురుషులు, 1,12,049 మహిళలు ఇతరులు 21 మంది కలిపి 2,19,248 ఓటర్లు ఉండగా 1,65,257 ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 76,839, మహిళలు 88,416 ఉన్నారు. ఈ లెక్కన మహిళలు11,577మంది అధికంగా ఓటు హక్కు వినియోగించుకోవటంతో పలాస అసెంబ్లీ అభ్యర్థి గెలుపులో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని