logo

Chirala: చీరాల రైల్వేస్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌.. ఆందోళనకు గురైన ప్రయాణికులు

బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో నాలుగు, ఐదు ప్లాట్‌ఫామ్‌లపై మంటలు చెలరేగాయి.

Published : 18 Jun 2024 11:57 IST

చీరాల: బాపట్ల జిల్లా చీరాల రైల్వేస్టేషన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో నాలుగు, ఐదు ప్లాట్‌ఫామ్‌లపై మంటలు చెలరేగాయి. అదే సమయంలో ఐదో ప్లాట్‌ఫామ్‌పై గూడూరు- విజయవాడ పాసింజర్‌ రైలు ఆగి ఉండటంతో అందులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధిక శబ్దంతో నిప్పురవ్వలు రావడంతో ఆందోళన చెందారు. స్టేషన్‌ అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని