logo

పుట్ట మన్ను తెచ్చి.. శ్రీకారం చుట్టి

దక్షిణ సింహాచలంగా పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు.

Published : 18 Jun 2024 01:42 IST

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా పాత సింగరాయకొండలోని వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రసిద్ధి. కొలిచిన భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతున్నారు. ఎంతో వైభవం కలిగిన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత వేద పండితులు ఆలయ ఆవరణంలోని కోనేరు వద్ద నుంచి పుట్ట మన్ను తెచ్చి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం సోమవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 10 గంటలకు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. చంద్రప్రభ వాహనంపై కొలువుదీర్చి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తన్మయత్వం చెందారు. పూజలు చేసి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని