logo

Nellore: పింఛను దారుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, నెల్లూరు శాఖ నాయకులు కలిసి అభినందించారు.

Updated : 18 Jun 2024 16:26 IST

కావలి: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్, నెల్లూరు శాఖ నాయకులు కలిసి అభినందించారు. ఈ సందర్భంగా పింఛను దారుల సమస్యలను మంత్రికి వివరించి వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా నిధి యాప్‌లో రిటైర్డ్ టీచర్‌కి సంబంధించినటువంటి పెన్షన్లు ఎప్పటికప్పుడు చూసుకునేటట్లు అవకాశం కల్పించాలని కోరారు. మంత్రి వెంటనే చేస్తానని వారికి తెలిపారు. కేతా సుధాకర్ రెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, విశ్రాంత డీఈవో నరసింహారెడ్డి, నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామి శెట్టి, బాలాజీ, పరమేశ్వరయ్య, ఓబుల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎస్.కె చాంద్ బాషా, ఏకే రాయల్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని