logo

Kalki: కల్కి సినిమాలో పెరుమాళ్లపాడు ఆలయం

కల్కి చిత్రంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది.

Updated : 12 Jun 2024 07:56 IST

కల్కి చిత్రంలోని నాగేశ్వరస్వామి ఆలయం 

చేజర్ల, న్యూస్‌టుడే: కల్కి చిత్రంలో చేజర్ల మండలం పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయాన్ని చిత్రీకరించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 2020లో స్థానిక యువత.. ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని వెలికితీశారు. అనంతరం దీన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం, దేవదాయ, పురావస్తు శాఖలను స్థానికులు కోరారు. పెన్నానదికి అభిముఖంగా ఉన్న ప్రాంతంలో ఆలయం ఉండేది. 200 ఏళ్ల క్రితం ఇసుక తుపాన్ల కారణంగా ఆలయం ఇసుకలో కూరుకుపోయింది. వందల ఎకరాల మాన్యం ఉన్న ఈ ఆలయాన్ని వెలికి తీసి పునరుద్ధరిస్తే పెన్నా తీరంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని