logo

అనుమతి లేని ఆసుపత్రి సీజ్‌

హత్నూర మండలం చింతల్‌చెరులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రిని మంగళవారం సీజ్‌ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు.

Published : 19 Jun 2024 00:56 IST

హత్నూర, న్యూస్‌టుడే: హత్నూర మండలం చింతల్‌చెరులో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ప్రైవేట్‌ ఆసుపత్రిని మంగళవారం సీజ్‌ చేసినట్లు జిల్లా వైద్యాధికారిణి గాయత్రిదేవి తెలిపారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యురాలు నేత్రావతితో కలిసి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆర్‌ఎంపీ రవీందర్‌ క్లినిక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. లోపాలు ఉన్నట్లు గుర్తించి చర్యలకు ఉపక్రమించారు. ఎనిమిది బెడ్స్‌ ఏర్పాటు చేసి వైద్య అందించడంతో పాటు డిస్పోజబుల్‌ సిరంజిలను వేడి నీళ్లల్లో వేసి మళ్లీ వాడుతున్నాడు. క్లినిక్‌కు అనుసంధానంగా మెడికల్‌ షాపు నడుపుతూ.. అందులో పదో తరగతి చదివిన అమ్మాయితో రోగులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి క్లీనిక్‌ను సీజ్‌ చేశామన్నారు. నిర్వాహకుడు రవీందర్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య సమస్యను గుర్తించిన అధికారిణి.. డీపీవో దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులు పరిమితులకు మించి వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎంబీబీఎస్, ఆయూష్‌ వైద్యులు క్లీనిక్‌ల నిర్వహణకు తప్పని సరిగా అనుమతులు పొందాలన్నారు.


సదరం శిబిరానికి 124 మంది హాజరు

సంగారెడ్డి అర్బన్,న్యూస్‌టుడే: జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మంగళవారం సదరం శిబిరం నిర్వహించారు. వైద్యుల పర్యవేక్షణలో ఈ శిబిరం సాగింది. దీనికి వివిధ రకాల వైకల్యం కలిగిన 124 మంది హాజరైనట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని