logo

తడబడిన చదువులు

సిమెంట్‌నగర్‌లోని పాణ్యం సిమెంట్‌ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు.

Published : 19 Jun 2024 02:11 IST

వరండాలో కూర్చున్న విద్యార్థులు

సిమెంట్‌నగర్‌లోని పాణ్యం సిమెంట్‌ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వ తోడ్పాటుతో పాణ్యం సిమెంట్‌ పరిశ్రమ పర్యవేక్షణలో పాఠశాల కొనసాగింది. పాఠశాలను యాజమాన్యానికి అప్పజెప్పాలని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ 19, 20, 21 ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని సిమెంట్‌ పరిశ్రమ యాజమాన్యం తెలియజేసింది.  3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 500 మంది విద్యార్థులు, ఇందులో ప్రైమరీ పాఠశాలలో నలుగురు, ఉన్నత పాఠశాలలో 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్‌గా పాఠశాలను నడుపుతూ విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తామని యాజమాన్యం తెలిపినట్లు ప్రధానోపాధ్యాయిని ముసరత్‌ జహాన్‌ తెలిపారు. పాఠశాలను కంపెనీ ప్రైవేట్‌గా నడిపినా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తించవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేనేజ్‌మెంట్‌ నడుపుతామని ప్రభుత్వం జీవోలో చెప్పిందని, దీని ప్రకారం ఉపాధ్యాయులను కౌన్సిలింగ్‌కు రమ్మని శనివారం చెప్పారని, మళ్లీ ప్రొసీడింగ్‌ ఇచ్చారని, సోమవారం ఫోన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ మార్పుదల చేసినట్లు కర్నూలు విద్యాశాఖ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, అధికారికంగా ప్రొసీడింగ్‌ ఇవ్వకపోవడంతో కౌన్సిలింగ్‌కు వెళ్లకపోతే అన్యాయం జరుగుతుందని ఆందోళనతో 23 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్‌ కోసం డీఈవో కార్యాలయానికి వెళ్లారు. ఉపాధ్యాయులు అందరూ కౌన్సిలింగ్‌కు కర్నూలు వెళ్లడంతో ప్రధానోపాధ్యాయురాలు ముసరత్‌ జహాన్‌ ఒక్కరే విద్యార్థులకు పాఠాలు బోధించారు.

న్యూస్‌టుడే, బేతంచెర్ల 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని