logo

జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు.

Published : 19 Jun 2024 02:07 IST

మంత్రులతో చర్చించి త్వరలో తేదీ ఖరారు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు. 90 రోజులలోపు జడ్పీ సమావేశం విధిగా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 19న జరిపేలా అధికారులు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటన వెలువడటం.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బిజీగా ఉండటంతో వాయిదా వేశారు. సమావేశం నిర్వహణపై మంత్రులతో చర్చించి తేదీ ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరులో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే 90 రోజుల గడువు ముగియనుండటంతో జడ్పీ అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపాల్సి ఉంటుంది.

సమగ్ర చర్చ జరిగేలా..

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో జడ్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అజెండా అంశాలపై చర్చించి తేదీ, సమయం ఖరారు చేయాల్సి ఉంది. ఈమేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.. కొన్ని శాఖలపై మొక్కుబడిగా చర్చించే విధానానికి స్వస్తి చెప్పాలని, ఉమ్మడి జిల్లా సమస్యలు ప్రతిబింబించేలా సమగ్ర చర్చ జరగాలని.. ఆమేరకు అజెండా తయారు చేయాలని జడ్పీ అధికారులను మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది. జడ్పీలో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఉండాలని.. ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని