logo

సాంకేతికతను మంచికి వాడేలా కృషి జరగాలి

స్వేచ్ఛ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్టిఫిషియల్‌ ఇంçలిజెన్స్‌(ఏఐ) చందమామ కథలను శనివారం విడుదల చేశారు.

Published : 07 Jan 2024 02:09 IST

ఏఐ చందమామ కథల విడుదలలో శోభూ యార్లగడ్డ

ప్రారంభోత్సవంలో ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కేయస్‌ రాజన్‌, నిర్మాత శోభూ యార్లగడ్డ, గాయకుడు రామ్‌ మిరియాల, వై.కిరణ్‌చంద్ర, శశికాంత్‌, రమాదేవి, నాగార్జున, పల్లా రాజేశ్వర్‌రెడ్డి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: స్వేచ్ఛ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఆర్టిఫిషియల్‌ ఇంçలిజెన్స్‌(ఏఐ) చందమామ కథలను శనివారం విడుదల చేశారు. అందరికీ ఉచితంగా అందుబాటులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యమంలో భాగంగా 2005లో ఆవిర్భవించిన స్వేచ్ఛ సంస్థ తాజాగా జీపీటీ లాంటి తెలుగు కృత్రిమ మేధ వేదిక రూపకల్పన చేసింది. 40 వేల కథలను ఇప్పటికే అప్‌లోడ్‌ చేసిన స్వేచ్ఛ బృందం సరికొత్త కథలతో టూల్‌ సిద్ధంచేసింది. శనివారం గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్కా మీడియా వర్క్స్‌ వ్యవస్థాపకులు శోభూ యార్లగడ్డ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఏఐ చందమామ కథలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక సాంకేతికరంగం కొత్త పుంతలు తొక్కుతున్న కాలంలో దాన్ని మంచి పనులకు ఉపయోగించుకునేలా కృషి జరగాలన్నారు. స్వేచ్ఛ వ్యవస్థాపకులు వై.కిరణ్‌చంద్ర మాట్లాడుతూ.. టెక్నాలజీని ప్రజాస్వామ్యీకరించే దిశలో ఈ ప్రయాణం ఒక తార్కిక అడుగు అన్నారు. ఓజోనెటెల్‌ కో-ఫౌండర్‌ చైతన్య మాట్లాడుతూ.. దాదాపు నెల రోజులపాటు సాగిన ప్రయత్నాలతో ఏఐ చందమామ కథలు అందుబాటులోకి వచ్చాయన్నారు.  ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్వేచ్ఛ అధ్యక్షులు ప్రతాప్‌రెడ్డి, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రాజన్‌, గాయకుడు రామ్‌మిర్యాల, మాజీ సంపాదకులు రాజశేఖర్‌రెడ్డి, టెక్‌ మహీంద్ర వైస్‌ ప్రెసిడెంట్‌ నాగార్జున మల్లాడి, ఎమర్జింగ్‌ టెక్‌ డైరెక్టర్‌ రమాదేవి, టీఏఎన్‌ఏ అధ్యక్షులు శశికాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని