logo

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ మళ్లింపులు

లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల సమీపంలో రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Updated : 04 Jun 2024 07:31 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల సమీపంలో రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మంగళవారం అవసరాన్ని బట్టి ట్రాఫిక్‌ను మళ్లిస్తామని నగర ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

  • ముషీరాబాద్‌ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు దోమలగూడ ఏవీ కళాశాల, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్‌ స్కూల్‌లో జరగనుంది. ఇక్కడికి వచ్చే వాహనాలు ప్రభుత్వ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలో నిలపాలి.
  • చాంద్రాయణగుట్ట లెక్కింపు బషీర్‌బాగ్‌ నిజాం కళాశాలలో ఉంది. వాహనాలను నిజాం కళాశాల క్రీడామైదానంలో నిలపాలి.
  • అంబర్‌పేట్‌ లెక్కింపు నారాయణగూడ రెడ్డి మహిళా కళాశాలలో. వాహనాలను వైఎంసీఏ మైదానం, శాంతి థియేటర్‌లో నిలపాలి.
  • మలక్‌పేట్‌ లెక్కింపు అంబర్‌పేట్‌ జీహెచ్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో. వాహనాలు జీహెచ్‌ఎంసీ మైదానంలో నిలపాలి.
  • సనత్‌నగర్‌ లెక్కింపు ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (లా కళాశాల పక్కన)లో. వాహనాలను ఎంబీఏ కళాశాల మైదానంలో నిలపాలి.
  • సికింద్రాబాద్‌ లెక్కింపు ఓయూ క్యాంపస్‌లోని పీజీ రామిరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో. సైక్లింగ్‌ వెల్లోడ్రాన్‌ గ్రౌండ్‌లో వాహనాలు నిలపాలి.
  • గోషామహల్‌ లెక్కింపు కోఠి మహిళా వర్సిటీ ఆడిటోరియంలో. వాహనాలను కళాశాల మైదానంలో నిలపాలి.
  • చార్మినార్‌ లెక్కింపు నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో. వాహనాలను ఎంజే మార్కెట్, హైదరాబాద్‌ అడ్మిన్‌ కార్యాలయం పక్కన ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిలపాలి.
  • యాకుత్‌పుర లెక్కింపు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని సరోజినీనాయుడు వనితా మహావిద్యాలయంలో. వాహనాలను భీమ్‌సింగ్‌రావు బాడా పార్కింగ్‌ ఏరియాలో నిలపాలి.
  • కార్వాన్‌ లెక్కింపు మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో. వాహనాలు కళాశాల వెనుక వైపు లేన్‌లో నిలపాలి.
  • నాంపల్లి లెక్కింపు మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌టీయూలో. వాహనాలు హాకీ గ్రౌండ్‌లో, ఐబా హోటల్‌ నుంచి శాంతినగర్‌ క్లబ్‌ వరకు నిలపాలి.  
  • బహదూర్‌పుర లెక్కింపు బండ్లగూడలోని అరోరా లీగల్‌ సైన్స్‌ అకాడమీలో. వాహనాలు కళాశాల లోపల నిలపాలి.
  • ఖైరతాబాద్, జూబ్లీహిల్స్‌ లెక్కింపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో. వాహనాలను బెటాలియన్‌ ఓపెన్‌ గ్రౌండ్స్‌లో నిలపాలి.
  • కంటోన్మెంట్‌ లెక్కింపు సీఎస్‌ఐఐటీ, వెస్లీ కళాశాల ప్రాంగణంలోని మైదానంలో. వాహనాలను నిర్ణీత ప్రదేశాల్లోనే నిలపాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని