logo

Komatireddy Venkat Reddy: రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్‌రోడ్డు పూర్తి చేస్తాం: మంత్రి కోమటిరెడ్డి

ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 23 Jun 2024 14:37 IST

హైదరాబాద్: ఎన్‌హెచ్‌ 65పై ప్రమాదాలు జరిగే బ్లాక్‌ స్పాట్లను గుర్తించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. 17 బ్లాక్‌ స్పాట్ల వద్ద తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిట్యాల వద్ద రూ.40 కోట్లతో ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. రూ.30 వేల కోట్లతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు పూర్తి చేస్తామన్నారు. గత భారాస ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అప్పులు చేసిందని ఆరోపించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని