logo

అక్షర యోధుడు రామోజీ

రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ‘పద్మవిభూషణ్‌’ చెరుకూరి రామోజీరావు పేదల పక్షాన పోరాడిన అక్షర యోధుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు.

Published : 18 Jun 2024 05:25 IST

నివాళులర్పిస్తున్న శంకరరావు, క్రాంతికుమార్, బీసీ సంఘం నాయకులు 

మంగళగిరి, తాడేపల్లి, న్యూస్‌టుడే: రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ‘పద్మవిభూషణ్‌’ చెరుకూరి రామోజీరావు పేదల పక్షాన పోరాడిన అక్షర యోధుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. మంగళగిరిలోని ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీ స్వయంకృషితో వ్యాపార, మీడియా, సినిమా రంగాల్లో రాణించారన్నారు. బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌ మాట్లాడుతూ అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. సంఘం జిల్లా అధ్యక్షులు పారెపలి మహేష్‌ మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు ఎనలేని సేవలందించారన్నారు. కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కోఆర్డినేటర్‌ స్వాతిగౌడ్, రాష్ట్ర నాయకులు శివరామ్‌ బాబాజీ, మోహన్‌రావు, ఉడతా శ్రీనివాసరావు, తిరువీధుల కిరణ్, ఆలా శివాజీ యాదవ్, జయలక్ష్మీ, సూర్యప్రకాష్, గోపి, యోగి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని