logo

పర్యాటకులనూ వదలని సైబర్‌ నేరగాళ్లు

సూర్యలంకలో పర్యాటక శాఖ బీచ్‌ రిసార్ట్స్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తెరిచి గదులు బుక్‌ చేసుకునే పర్యాటకులను మోసగించి రూ.వేల నగదు తమ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకుంటున్న సైబర్‌ నేరగాళ్ల ఉదంతమిది.

Updated : 18 Jun 2024 05:57 IST

సూర్యలంక హరిత రిసార్ట్స్‌ పేరుతో అక్రమ వసూళ్లు

బాపట్ల, న్యూస్‌టుడే: సూర్యలంకలో పర్యాటక శాఖ బీచ్‌ రిసార్ట్స్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ తెరిచి గదులు బుక్‌ చేసుకునే పర్యాటకులను మోసగించి రూ.వేల నగదు తమ బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయించుకుంటున్న సైబర్‌ నేరగాళ్ల ఉదంతమిది. ఆన్‌లైన్‌లో హరిత బీచ్‌ రిసార్ట్స్‌ సూర్యలంక పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు రూపొందించారు. ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకునే పర్యాటకులకు ఈ వెబ్‌సైట్లోకి వెళ్లి నగదు చెల్లిస్తున్నారు. నగదు చెల్లించి కొంతమంది పర్యాటకులు సూర్యలంక రిసార్ట్స్‌కు వచ్చి తాము ఆన్‌లైన్లో నగదు చెల్లించామని గదులు ఇవ్వాలని స్థానిక పర్యాటక శాఖ సిబ్బందిని అడిగారు. అయితే నగదు చెల్లించిన పర్యాటకుల పేరు మీద గదులు బుక్‌ కాని విషయాన్ని సిబ్బంది గుర్తించి ఉన్నతాధికారులు తెలియజేశారు. ఉన్నతాధికారుల పరిశీలనలో నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా పర్యాటకులను మోసగిస్తున్న విషయం బయటకు వచ్చింది. సూర్యలంక పర్యాటక శాఖ రిసార్ట్స్‌ మేనేజర్‌ అశోక్‌ ఫిర్యాదు మేరకు బాపట్ల గ్రామీణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని