logo

ప్రపంచ స్కేటింగ్‌లో మెరిసిన తెలుగుతేజం

ప్రపంచ స్కేటింగ్‌ పోటీల్లో తెలుగు తేజం మాత్రపు జెస్సీరాజ్‌(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది.

Published : 18 Jun 2024 04:53 IST

పసిడి పతకంతో జెస్సీరాజ్‌

విజయవాడ క్రీడలు, మంగళగిరి, న్యూస్‌టుడే : ప్రపంచ స్కేటింగ్‌ పోటీల్లో తెలుగు తేజం మాత్రపు జెస్సీరాజ్‌(13) సత్తా చాటి పసిడి పతకంతో మెరిసింది. న్యూజిలాండ్‌లోని న్యూ ప్లేమౌత్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి జరుగుతున్న పసిఫిక్‌ కప్‌ ఆర్టిస్టిక్‌ ఓపెన్‌ ఇన్విటేషన్‌ పోటీల్లో జెస్సీరాజ్‌ భారత్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. ఆదివారం జరిగిన పోటీల్లో జెస్సీరాజ్‌ ఇన్‌లైన్‌ ఫ్రీ స్టైల్‌ ఈవెంట్‌లో అండర్‌-14 బాలికల విభాగంలో తలపడి పసిడి పతకం కైవసం చేసుకుందని రాష్ట్ర రోలర్‌ స్కేటింగ్‌ సంఘం కార్యదర్శి థామస్‌ చౌదరి తెలిపారు. ఈ ఈవెంట్‌లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిలాండ్‌ దేశాలకు చెందిన 17 మంది క్రీడాకారిణులు తలపడగా.. జెస్సీరాజ్‌ అత్యధికంగా 31.98 పాయింట్లు స్కోర్‌ చేసి అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని