logo

పిఠాపురంలో ఓట్ల లెక్కలివి

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అడుగడుగునా ఆసక్తి నెలకొంది. తొలి రౌండ్‌ నుంచీ పవన్‌ కల్యాణ్‌ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు.

Updated : 05 Jun 2024 06:12 IST

పవన్‌ కల్యాణ్‌కు ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యమే

కాకినాడ జేఎన్‌టీయూ ప్రాంగణం వద్ద నాగబాబు 

పిఠాపురం, న్యూస్‌టుడే: పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అడుగడుగునా ఆసక్తి నెలకొంది. తొలి రౌండ్‌ నుంచీ పవన్‌ కల్యాణ్‌ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. చివరకు ఈవీఎం ఓట్ల ద్వారా 69,169 ఓట్ల ఆధిక్యతను జనసేనాని దక్కించుకోగా.. పోస్టల్‌ బ్యాలట్‌తో కలిపి ఆ లెక్క 70,279కి చేరింది. రౌండ్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం..

మొదటి నుంచే స్పష్టం

పిఠాపురం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ 18 రౌండ్లు జరిగింది. మొదటి రౌండ్‌ నుంచి చివరి వరకూ పవన్‌ కల్యాణ్‌ అధిక్యంలో కొనసాగుతూనే వచ్చారు. తొలుత గొల్లప్రోలు, పట్టణం, పిఠాపురం రూరల్, పిఠాపురం పట్టణం, కొత్తపల్లి మండలాల వారీగా 14 టేబుళ్లు 18 రౌండ్లలో కౌంటింగ్‌ జరిగింది. మొదటి రౌండ్‌ 4,186 మెజార్టీ రాగా అక్కడ నుంచి 2 నుంచి 5వేలు వంతున మెజార్టీ పెరుగుతూ వచ్చి 69,169 మెజార్టీ వచ్చింది.  18 రౌండ్లలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీతకు 63,556 ఓట్లు పోలవ్వగా, పవన్‌ కల్యాణ్‌ మెజార్టీ 69,169 వచ్చింది. అంటే.. వంగా గీతకు వచ్చిన ఓట్లన్నీ కలిపితే పవన్‌కు వచ్చిన మెజారిటీ ఓట్లనూ దాటలేకపోయాయి. ఇవి కాకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు కూడా అధికంగా వచ్చాయి. మొత్తం 1,34,394 ఓట్లు పవన్‌ కల్యాణ్‌కు రాగా, వంగా గీతకు 64,115 వచ్చాయి.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని