logo

బందరు అబ్బాయి.. జపాన్‌ అమ్మాయి

మనసులు కలిశాక ఒక ఇంటివారవడానికి కుల, మతాలు అడ్డుకావని నిరూపిస్తున్నారు ఈ జంట. మచిలీపట్నంకు చెందిన న్యాయవాది యక్కల ఉమా సుందర వీర వెంకట సుబ్బారావు, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు సుందర మణికంఠ దినకర్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు

Updated : 27 Oct 2023 05:50 IST

వరుడు దినకర్‌, వధువు ఎమీ షినోకి

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మనసులు కలిశాక ఒక ఇంటివారవడానికి కుల, మతాలు అడ్డుకావని నిరూపిస్తున్నారు ఈ జంట. మచిలీపట్నంకు చెందిన న్యాయవాది యక్కల ఉమా సుందర వీర వెంకట సుబ్బారావు, పద్మావతి దంపతుల చిన్న కుమారుడు సుందర మణికంఠ దినకర్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్కడే పనిచేస్తున్న జపాన్‌కు చెందిన ఎమీ షినోకితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.  ఇరువురు ఒకటి కావాలని నిర్ణయించుకుని ఇరు కుటుంబాలకు చెప్పగా వారు కూడా అంగీకరించారు. దీంతో ఇరువైపులకు చెందిన పెద్దల సమక్షంలో గురువారం రాత్రి నగరంలోని ఓ వేడుక మందిరంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించారు. షినో తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చే అవకాశం లేకపోవడంతో వరుడు మేనమామ, మేనత్తలు డా. భాస్కరరావు, లక్ష్మిలు కన్యాదానం చేశారు.విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి ఎం. సత్యనారాయణమూర్తి, న్యాయమూర్తులు ఏ. నరసింహమూర్తి, డా.షేక్‌ మహ్మద్‌ఫజలుల్లా, చినబాబు, పద్మ, శ్రీవాణి, మేరీ జియాఉద్దీన్‌, పలువురు న్యాయవాదులతోపాటు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంట్‌ సభ్యులు కొనకళ్ల నారాయణరావు పలువురు ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

తాజా వార్తలు (Latest News)

మరిన్ని

సుఖీభవ

చదువు