logo

వీరి నోటా చెల్లనిమాట

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నోటాకు ఓట్లు పడ్డాయి.

Updated : 05 Jun 2024 05:54 IST

ఈనాడు డిజిటల్‌ - అమరావతి

 ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ నోటాకు ఓట్లు పడ్డాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పశ్చిమ పరిధిలో ఎక్కువగా అంటే.. 1,236 ఓట్లు, తక్కువగా నందిగామలో 928 ఓట్లు పోలయ్యాయి.

  •  కృష్ణా జిల్లాలో గరిష్ఠంగా అవనిగడ్డలో 1,952 పోలవగా... గుడివాడలో 981 పడ్డాయి.
  •  రెండు జిల్లాల్లోనూ వృద్ధులు, దివ్యాంగులు, ప్రభుత్వ ఉద్యోగులు భారీగా పోస్టల్‌ బ్యాలట్‌లను వినియోగించుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు 16,817మంది, లోక్‌సభ స్థానానికి 19,947 మంది పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు వేశారు. కృష్ణా జిల్లాకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలకు 16,657 మంది, మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి 16,878 మంది పోస్టల్‌ ఓట్లు వేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని