Mumbai: నడిరోడ్డుపై దారుణం.. యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి..ప్రాణాలు తీసి..

అనుమానంతో ఓ యువకుడు తన మాజీ ప్రియురాలిని నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. 

Updated : 18 Jun 2024 20:47 IST

ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయి (Mumbai)లో దారుణం చోటు చేసుకొంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్‌తో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ ఘోరాన్ని చూస్తూ నిలబడ్డారే కానీ.. ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ముంబయికి చెందిన రోహిత్‌ యాదవ్‌ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్‌ను దూరం పెట్టింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్‌ వెంబడించాడు. ఈ క్రమంలోనే ఇనుప రెంచీతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది.

దారితప్పిన కూతురు... తండ్రిపాలిట మృత్యువు

అయినా సరే.. యువతిని పలుమార్లు కొట్టాడు. ప్రాణాలు తీస్తున్నా ఆ ఘోరాన్ని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించకుండా చోద్యం చూశారు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని