Gold: రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది.

Updated : 13 May 2024 14:05 IST

ముంబయి: ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.13.56 కోట్ల విలువైన 22.14 కిలోల బంగారం పట్టుబడింది. గత మూడు రోజుల్లో జరిపిన తనిఖీల్లో పలువురు ప్రయాణికుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కస్టమ్స్‌ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల పాటు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇందులోభాగంగా బంగారం స్మగ్లింగ్‌ చేస్తున్న 11 మంది ప్రయాణికులు పట్టుబడ్డారు. అక్రమ రవాణాపై 20 కేసులు నమోదయ్యాయని కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. 

ప్రయాణికులు బంగారు కడ్డీలను వారి లోదుస్తులు, దుస్తులు, కార్డబోర్డ్‌ షీట్‌, బెల్ట్‌ మొదలైన వాటిల్లో దాచిపెట్టి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించారని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఏకంగా మైనపు రూపంలో ఉన్న బంగారాన్ని మలద్వారంలో దాచి తరలిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని