Road Accident: లారీని ఢీకొట్టిన టెంపో.. 13 మంది దుర్మరణం

Road Accident: ఓ టెంపో.. లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు.

Updated : 28 Jun 2024 13:54 IST

Road Accident | బెంగళూరు: కర్ణాటకలోని హవేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఆగి ఉన్న ఓ లారీని టెంపో వెనక నుంచి ఢీకొట్టడం వల్ల శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. వీరంతా సవదత్తిలోని ఆలయానికి వెళ్లి వస్తుండగా గుండెనహళ్లి సమీపంలో పుణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని