- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నాంపల్లి కోర్టు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా.. న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసులో అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్ వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదన్నారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లోని ఒకటో యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. -
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
డేటింగ్ యాప్ మాయలో చిక్కుకొని దిల్లీలో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఓ యువకుడు రూ.1.2 లక్షలు కోల్పోయాడు. -
అమ్మాయితో ప్రేమ వివాదం.. బీరు సీసాలతో కొట్టి హత్య
అమ్మాయి విషయంలో గొడవపడి తోటి స్నేహితుడిని దారుణంగా హత్య చేశారు కొందరు విద్యార్థులు. -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య.. వాహనం వదిలి పరార్
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ ఇంజినీర్ దారుణ హత్యకు గురయ్యాడు. -
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. -
కత్తి దూసిన ప్రేమోన్మాదం
తన కుమార్తెతో ప్రేమ వ్యవహారం వద్దని మందలించడమే ఆ తండ్రికి శాపమైంది. తన ఇంటికి వచ్చి కుటుంబసభ్యులతో గట్టిగా మాట్లాడారన్న కోపంతో ప్రేమోన్మాది పగ పెంచుకున్నాడు. -
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటర్లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. -
బతుకులు ఛిద్రం!
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. షాద్‌నగర్‌లోని సౌత్ గ్లాస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం జరిగిన పేలుడు ఘటనలో అయిదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. -
ఆయువు తీసిన అతివేగం
అతివేగం, నిద్రమత్తుతో అయిదుగురి ప్రాణాలుపోయాయి. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్‌లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పది మందిలో అయిదుగురు మృతిచెందారు. -
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
కర్ణాటకలోని హావేరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి
ఆరేళ్ల బాలుడిని వీధి కుక్కలు చుట్టుముట్టి కరవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఠాణా పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జియో సేఫ్, జియో ట్రాన్స్‌లేట్.. ఎలా పనిచేస్తాయ్..?
-
దంచికొట్టిన కోహ్లీ, అక్షర్.. దక్షిణాఫ్రికా టార్గెట్ 177
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం