Crime News: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 11 మంది మావోయిస్టులు మృతి

నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు మృతి చెందారు.

Updated : 02 Jul 2024 18:14 IST

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నారాయణపూర్‌ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 11 మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. ధనంది-కుర్రేవాయ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుందని ఆయన తెలిపారు. 

ఖోకామెటా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో జిల్లా రిజర్వ్‌ పోలీసులులతోపాటు స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ దళాలు సంయుక్తంగా సోమవారం అపరేషన్‌ ప్రారంభించాయని తెలిపారు. గుర్తించిన మావోయిస్టులు కాల్పులకు దిగారని, దీంతో బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతోందని మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య పెరిగే అవకాశముందని సుందర్‌రాజ్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని