రూ.10.61 లక్షల విలువైన రేషన్‌ బియ్యం పట్టివేత

రూ.లక్షల విలువైన రేషన్‌ బియ్యం ఓ రైసు మిల్లులో అధికారులకు పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలోని శ్రీరామకృష్ణ రైసు మిల్లుపై గురువారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు దాడులు చేశారు.

Published : 05 Jul 2024 04:48 IST

రైసు మిల్లు యజమానిపై కేసు నమోదు

రైసు మిల్లులోని రేషన్‌ బియ్యం వద్ద అధికారులు

రంగంపేట, న్యూస్‌టుడే: రూ.లక్షల విలువైన రేషన్‌ బియ్యం ఓ రైసు మిల్లులో అధికారులకు పట్టుబడింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పెదరాయవరంలోని శ్రీరామకృష్ణ రైసు మిల్లుపై గురువారం సివిల్‌ సప్లయ్‌ అధికారులు దాడులు చేశారు. అక్కడ రూ.10.61 లక్షల విలువ చేసే 23,330 కిలోల బియ్యాన్ని గుర్తించి, యజమాని కొనుజుల శ్రీధర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని వడిశలేరులోని ఓ మిల్లుకి తరలించినట్టు అధికారులు తెలిపారు. ఈ బియ్యం స్థానికంగా సేకరించిందా? లేక తెలంగాణ నుంచి వచ్చిందా? అనే దానిపై వారు విచారణ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని