22 ఏళ్ల తర్వాత పట్టుబడిన సామూహిక అత్యాచార నిందితుడు

సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటుచేసుకుంది.

Published : 05 Jul 2024 03:43 IST

పాల్ఘర్‌: సామూహిక అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి 22 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో చోటుచేసుకుంది. 2002 జనవరి 2న ఒక మహిళను నలుగురు దుండగులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరిని పోలీసులు వెంటనే అరెస్టు చేసినప్పటికీ మైఖేల్‌ అలియాస్‌ టిప్పు రామ్‌ శిరోమన్‌ పాండే (46), శంకర్‌ అనే వ్యక్తులు పారిపోయారు. ఇన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మైఖేల్‌ను బుధవారం నలసొపర వద్ద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. శంకర్‌ కోసం అన్వేషిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని