అత్యాచార ఘటనపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి

ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది.

Published : 05 Jul 2024 03:07 IST

డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశం

ఈనాడు-హైదరాబాద్‌: ఉద్యోగం కోసం పక్క రాష్ట్రం నుంచి హైదరాబాద్‌ నగరానికి వచ్చిన యువతికి మత్తు మందు ఇచ్చి ఇద్దరు అత్యాచారం చేసిన ఘటనపై సకాలంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని డీజీపీని జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆదేశించింది. మియాపూర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మూడు రోజుల్లోగా సమగ్ర నివేదిక పంపాలని స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీపీకి లేఖ పంపినట్లు జాతీయ మహిళా కమిషన్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. 

యువతిపై అత్యాచారం కేసులో నిందితులు సంగారెడ్డి, జనార్దన్‌రెడ్డిలను మియాపూర్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారిని విచారణ నిమిత్తం కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని