నీపై దయ చూపడమా?: కోర్టు వ్యాఖ్య

కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు.

Published : 03 Jul 2024 04:51 IST

కేరళలో కామాంధుడైన తండ్రికి 101 ఏళ్ల జైలు

మల్లపురం: కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమె భవిష్యత్తును చిదిమేశాడు. పదేళ్ల ప్రాయం నుంచే ఆమెపై లైంగికదాడి మొదలుపెట్టాడు. తన పైశాచికత్వం బయటపెట్టకూడదని బెదిరిస్తూ ఆరేళ్లపాటు మృగంలా ప్రవర్తించాడు. బాలిక తల్లి నిద్రిస్తున్న సమయంలో, ఆమె ఇంట్లో లేనప్పుడు ఈ అకృత్యానికి పాల్పడేవాడు. 16 ఏళ్ల వయసులో ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేరళలోని మల్లపురానికి చెందిన స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. పోక్సో, జువెనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ వంటి చట్టాల కింద గత వారం అతడికి 101 ఏళ్ల జైలుశిక్షతోపాటు యావజ్జీవ కారాగార శిక్షనూ విధించింది. ‘‘దీనిని సాధారణ లైంగిక నేరంగా చూడలేం. నేరానికి పాల్పడిన వ్యక్తి ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. అతడిపై ఎలాంటి కనికరం చూపలేం’’ అని కోర్టు స్పష్టం చేసింది. బాలిక మూడు నెలల గర్భాన్ని వైద్యులు తొలగించారు. బాధితురాలి తల్లితోపాటు ఇతర కుటుంబసభ్యులు కూడా అతడికి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని