కొత్త చట్టంతో చార్మినార్‌లో తొలి కేసు

దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు.

Published : 02 Jul 2024 06:07 IST

నంబరు ప్లేటు లేని వాహదారులపై డిజిటల్‌ కేసు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో అమల్లోకి వచ్చిన కొత్త చట్టంతో రాష్ట్రంలో తొలిసారిగా చార్మినార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. భారతీయ న్యాయ సంహిత(బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌(బీఎస్‌ఏ) చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చారు. ఆదివారం చార్మినార్‌ ఠాణా పరిధిలోని గుల్జార్‌ హౌస్‌ క్రాస్‌రోడ్‌ వద్ద అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో నంబరు ప్లేటు లేకుండా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఇద్దరిని గుర్తించారు. వీరిని బోరబండకు చెందిన సోహెల్‌ అన్సారీ(19), ఘాన్సీబజార్‌కు చెందిన షేక్‌ సత్వర్‌(26)లుగా గుర్తించారు. సుమోటోగా 281 బీఎన్‌ఎస్, సెక్షన్‌ 80(ఏ), 177 ఎంవీ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం తెలిపారు. కొత్తచట్టాల అమల్లో భాగంగా చార్మినార్‌ పోలీసులు నమోదుచేసిన కేసుపై రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఎక్స్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

 

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని