చిన్నారి తలలో పెన్ను దిగబడి..

భద్రాచలం పట్టణం సుభాశ్‌నగర్‌ కాలనీకి చెందిన రియాన్షిక అనే అయిదేళ్ల చిన్నారికి తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది.

Updated : 02 Jul 2024 06:17 IST

భద్రాచలం పట్టణం: భద్రాచలం పట్టణం సుభాశ్‌నగర్‌ కాలనీకి చెందిన రియాన్షిక అనే అయిదేళ్ల చిన్నారికి తలలో పెన్ను దిగబడటంతో పరిస్థితి విషమంగా మారింది. యూకేజీ చదువుతున్న చిన్నారి మంచంపై కూర్చోని రాసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బాలికను వెంటనే పట్టణంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లగా పరిశీలించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన ఖమ్మం తరలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని