మద్యం కేసులో వైకాపా నేత అరెస్టు

అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్‌ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు.

Published : 01 Jul 2024 05:07 IST

తాడేపల్లి, న్యూస్‌టుడే: అనధికారికంగా మద్యం నిల్వ చేసిన కేసులో.. మంగళగిరి వైకాపా అభ్యర్థినిగా పోటీచేసిన మురుగుడు లావణ్య తండ్రి, వైకాపా నాయకుడు కాండ్రు శివనాగేంద్రంను అరెస్టు చేసినట్లు సెబ్‌ సీఐ ప్రసన్న ఆదివారం తెలిపారు. మంగళగిరిలోని కాండ్రు వారి వీధిలో దామర్ల వీరాంజనేయులు నివాసంలో జూన్‌ 1న 6,528 మద్యం సీసాలను నిల్వ చేశారు.సెబ్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని వీరాంజనేయులును అరెస్టు చేశారు.లావణ్య తండ్రి శివనాగేంద్రంను శనివారం అరెస్టుచేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా 15 రోజుల పాటు రిమాండ్‌ విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని