‘హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం’

వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు.

Updated : 01 Jul 2024 05:43 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ హరినాథ్‌

కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం కారణంగానే మున్సిపాలిటీ పరిధిలోని కురాకులతోటకు చెందిన వన్నూరస్వామి హత్యకు గురైనట్లు సీఐ హరినాథ్‌ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పట్టణ సర్కిల్‌ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆయన వివరాలు వెల్లడించారు. ఆ గ్రామ సమీపంలో చెలిగెద్దులకొండ వద్ద అదే గ్రామానికి చెందిన వన్నూరస్వామిని గొంతు కోసి హత్య చేసిన ఘటనకు సంబంధించి 17 ఏళ్ల బాలుడిని అరెస్టు చేశారు. వన్నూరుస్వామి అక్క కుమారుడైన నిందితుడిది గుత్తి మండలం కొజ్జేపల్లి గ్రామం కాగా చిన్నప్పటి నుంచి కురాకులతోటలోని మామ ఇంట్లో ఉండేవాడు. ఆ సమయంలో మృతుడి భార్యతో సన్నిహితంగా ఉండేవాడు. ఈ విషయమై వారు పలుమార్లు గొడవ పడ్డారు. అడ్డుగా ఉన్న వన్నూరస్వామిని అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఈనెల 28న గ్రామ సమీపంలో కొండ వద్ద ఇద్దరూ మద్యం తాగారు. ఆ సమయంలో నిందితుడు తన వెంట తెచ్చుకొన్న కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయాడు. కుందుర్పి, కంబదూరు ఎస్‌ఐలు వెంకటస్వామి, ఆంజనేయులు,  కానిస్టేబుళ్లు ఖాజామోహిద్దీన్, పుష్పరాజ్, రాయుడు, వంశీకృష్ణ, షఫీ, గంగాధర ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలించి నిందితుడిని పట్టణ సమీపంలో మారుతి వేబ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. విచారించగా కక్షసాధింపుతో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని