కరీంనగర్‌ జైలుకు ఆర్డీఓ సిడాం దత్తు తరలింపు!

కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్‌లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్‌(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్‌ జిల్లా జైలుకు పంపించారు.

Published : 01 Jul 2024 05:26 IST

డీటీ, ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు కూడా..
పరారీలో సర్వేయర్‌

నిందితులు సిడాం దత్తు, సుబ్బ శంభుదాస్, మెస్రం నాగోరావు, లక్ష్మీనారాయణగౌడ్‌లతో అనిశా సీఐ తిరుపతి, డీఎస్పీ వీవీ రమణమూర్తి తదితరులు

ఈనాడు, ఆసిఫాబాద్‌: కుమురం భీం జిల్లాలో రహదారి విస్తరణలో భాగంగా మంజూరైన రూ.4.3 కోట్ల పరిహారంలో అక్రమాలకు పాల్పడిన అప్పటి ఆసిఫాబాద్‌ ఆర్డీఓ సిడాం దత్తు (ప్రస్తుతం వరంగల్‌లో పనిచేస్తున్నారు), డిప్యూటీ తహసీల్దార్‌(డీటీ) మెస్రం నాగోరావు, స్థిరాస్తి వ్యాపారులు సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లను అనిశా అధికారులు ఆదివారం కరీంనగర్‌ జిల్లా జైలుకు పంపించారు. సర్వేయర్‌ భరత్‌ పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని అనిశా డీఎస్పీ వీవీ రమణమూర్తి తెలిపారు. నిందితులను విచారణ నిమిత్తం కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరనున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాల మేరకు ఈ ఏడాది మే 1న అనిశా అధికారులు విచారణ ప్రారంభించారు. సిడాం దత్తు, మెస్రం నాగోరావు, భరత్, సుబ్బ శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లతో పాటు శంభుదాస్‌ డ్రైవర్‌ పోరాల తిరుపతి, కవల్కార్‌ తారాబాయిల పేర్లను ఎఫ్‌ఆర్‌ఐలో చేర్చారు. వీరిలో దత్తు, నాగోరావు, శంభుదాస్, లక్ష్మీనారాయణగౌడ్‌లను శనివారం అదుపులో తీసుకున్న విషయం విదితమే.

మరో రూ.2 కోట్ల అవినీతి!

భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపుల్లో భాగంగా విచారణ చేస్తున్న అనిశా అధికారులకు మరో రూ.2 కోట్ల మేరకు సైతం అవకతవకలు జరిగాయని దృష్టికి వచ్చింది. ఎవరెవరు, ఎక్కడ అక్రమాలకు పాల్పడ్డారో తేల్చేందుకు విచారణను ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని