ఇంజినీరింగ్‌ ఆపేసి.. డ్రగ్స్‌ విక్రేతగా మారి

ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్‌ తీసుకుంటుండగా మాదాపూర్‌ పోలీసులు, టీజీ న్యాబ్‌ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు.

Updated : 30 Jun 2024 06:28 IST

వివరాలు వెల్లడిస్తున్న టీజీ న్యాబ్‌ ఎస్‌సీ   పి. సాయి చైతన్య, డీసీపీ వినీత్‌..

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్‌కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్‌ తీసుకుంటుండగా మాదాపూర్‌ పోలీసులు, టీజీ న్యాబ్‌ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో టీజీ న్యాబ్‌ ఎస్‌పీ పి.సాయిచైతన్య డీసీపీ వినీత్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. 

ఎన్‌ఐటీలో చదువుతూ..

బోయిన్‌పల్లికి చెందిన కురుంతోత్‌ రాథోడ్‌ నవీన్‌ నాయక్‌ అలియాస్‌ నవీన్‌రాథోడ్‌(27) బెంగళూరులో ఉంటాడు. చదువుల్లో చురుకైన అతను జేఈఈలో మంచి ర్యాంకు సాధించి 2015లో తమిళనాడు తిరుచిరాపల్లిలోని ఎన్‌ఐటీలో సీటు సాధించాడు. అక్కడే గంజాయికి అలవాటుపడి బానిసయ్యాడు. విషయం తెలిసి తల్లి వెళ్లి అక్కడే ఉంటూ కుమారుడిని ఆ అలవాటును మాన్పించేందుకు చేసిన యత్నాలు ఫలించలేదు.
శిక్ష పడినా.. : బీటెక్‌ మూడో సంవత్సరంలో చదువు మానేసి బెంగళూరుకు వెళ్లాడు. ఓ ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్‌ ఆఫీసర్‌గా చేరి ఉద్యోగరీత్యా వివిధ రాష్ట్రాలకు వెళ్లేవాడు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రేతలతో పరిచయాలు కాగా.. వారి నుంచి కొని అమ్మడం మొదలు పెట్టాడు. 2022లో, 23లో పోలీసులకు చిక్కగా.. జైలు శిక్ష పడింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అనారోగ్యానికి గురయ్యారు. తల్లి రెండేళ్లుగా మంచానికే  పరిమితమైంది. 
మాదాపూర్‌లో..: మాదాపూర్‌లో అతడితోపాటు దూద్‌బౌలికి చెందిన మాదక ద్రవ్యాల విక్రేత అయినా మోతికార్‌ సచిదానంద్‌ అలియాస్‌ సచిన్‌ ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌ రాజ్, రాజా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, టీజీ న్యాబ్‌ పోలీసులు శుక్రవారం దాడిచేశారు. రాజా పారిపోగా మిగతావారు పోలీసులకు చిక్కారు. వారి నుంచి 1.4 కిలోల గంజాయి స్వాధీనంచేసుకున్నారు. 
పెద్ద తప్పు చేశాను:  నవీన్‌నాయక్‌ ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్నాను. అమ్మనాన్నలను ఎంతో బాధపెట్టాను. వారిని క్షమాపణ కోరుతున్నా. ముఖం చాలక అమ్మనాన్నలకు దూరంగా ఉంటున్నాను. ఏడేళ్లుగా ఇంటికి వెళ్లడం లేదు. ఇకపై వాటి జోలికి వెళ్లను.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని