విద్యుదాఘాతంతో నలుగురి మృతి

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృత్యువాత పడ్డారు.

Published : 28 Jun 2024 05:23 IST

పశ్చిమ, ఏలూరు జిల్లాల్లో ఘటనలు

తాడేపల్లిగూడెం అర్బన్, ఆగిరిపల్లి, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృత్యువాత పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన గట్టిం వెంకన్న (60) భవన నిర్మాణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ (55)తో కలసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అన్నపూర్ణ మోటారు స్విచ్‌ వేసే క్రమంలో విద్యుత్‌ వైర్లు తాకడంతో గట్టిగా అరుస్తూ కుప్పకూలిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నంలో వెంకన్న కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. ఇద్దరు అక్కడకక్కడే మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉండగా.. వారికి వివాహాలయ్యాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.పది వేల ఆర్థికసాయం అందజేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదరకు చెందిన దొండపాటి నాగరత్నం (63) ఇంటి వద్ద దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగను తాకారు. ఆమె కుమారుడు దొండపాటి రామదాసు (42) తల్లిని రక్షించే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యారు. వారిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నాగరత్నంకు భర్త, రామదాసుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని