దంతెవాడలో 17 మంది, గడ్చిరోలి ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో 17 మంది మావోయిస్టులు గురువారం సీఆర్పీఎఫ్, పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు.

Published : 28 Jun 2024 05:22 IST

చర్ల, బల్లార్ష, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో 17 మంది మావోయిస్టులు గురువారం సీఆర్పీఎఫ్, పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. వారిలో ప్రభుత్వం రూ.లక్ష చొప్పున రివార్డు ప్రకటించిన ఐదుగురు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోనూ ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకాకు చెందిన రాంబర్తీ అలియాస్‌ జరీనా నరొటే(28), ఇదే జిల్లాలోని  ధనోరా తాలూకాకు చెందిన చంద్రకళ అలియాస్‌ మనీషా ఉయికే(29) జనజీవన స్రవంతిలో కలిశారు. 2010లో దళ సభ్యురాలిగా చేరిన జరీనా ప్రస్తుతం ఏరియా కమాండర్‌గా పని చేస్తున్నారు. 2011లో దళ సభ్యురాలిగా చేరిన మనీషా కమిటీ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. వీరిద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వీరికి  రూ.5 లక్షల నగదుతోపాటు ఉచిత నివాసం కల్పించనున్నట్లు ఎస్పీ నీలోత్పాల్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని