కోటాలో నీట్‌ అభ్యర్థి ఆత్మహత్య

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 17 ఏళ్ల నీట్‌ అభ్యర్థి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 28 Jun 2024 05:22 IST

కోటా: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 17 ఏళ్ల నీట్‌ అభ్యర్థి ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిహార్‌లోని భాగల్‌పుర్‌కు చెందిన రిషిత్‌ అగర్వాల్‌ స్థానికంగా హాస్టలు (పీజీ)లో ఉంటూ రెండేళ్లుగా నీట్‌ పరీక్షకు శిక్షణ పొందుతున్నాడు. గురువారం మధ్యాహ్నం రిషిత్‌ స్నేహితులు అతడి గది తలుపులు తట్టినా బయటకు రాలేదు.  పోలీసులు అక్కడకు చేరుకొని, గది తలుపులు పగలగొట్టి చూడగా.. రిషిత్‌ ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. గతేడాది కోటాలో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని