మహిళల దుస్తులు ధరించి విమానాశ్రయ అధికారి ఆత్మహత్య

మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 26 Jun 2024 05:22 IST

రుద్రపుర్‌: మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఉధమ్‌సింగ్‌నగర్‌ జిల్లా పంత్‌నగర్‌లోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పితోర్‌గఢ్‌ జిల్లాకు చెందిన ఆశిష్‌ చౌసాలి విమానాశ్రయంలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఆయన మహిళల దుస్తులు ధరించి, నుదుటన బొట్టు బిళ్ల పెట్టుకుని, లిప్‌స్టిక్‌ వేసుకుని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉధమ్‌సింగ్‌నగర్‌ జిల్లా (నగర) ఎస్పీ మనోజ్‌ కత్యాల్‌ మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటనను ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, గదిలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని