జంతు హింసపై కేసు నమోదు

కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి చెందిన వినోద్‌ తన పెంపుడు కుక్కను హింసించాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. వినోద్‌ కుక్క రెండు కాళ్లు పట్టుకొని పైకి లేపి తిప్పుతూ ఇబ్బందికి గురి చేశాడు.

Published : 26 Jun 2024 05:14 IST

కుక్కను హింసిస్తున్న వినోద్‌

ఆలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా ఆలూరు పట్టణానికి చెందిన వినోద్‌ తన పెంపుడు కుక్కను హింసించాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. వినోద్‌ కుక్క రెండు కాళ్లు పట్టుకొని పైకి లేపి తిప్పుతూ ఇబ్బందికి గురి చేశాడు. ఈ ఘటనను అతని స్నేహితులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ఆ వీడియో చూసిన తెలంగాణకు చెందిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ ప్రతినిధులు... వినోద్‌ కుక్కను హింసించాడని కోర్టులో కేసు వేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు