మహిళపై దాడి చేసి తల లాక్కెళ్లిన చిరుత

వంట చెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల, మహానంది మండలాల సరిహద్దు ప్రాంతంలోని పచ్చర్ల గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 26 Jun 2024 05:14 IST

శిరివెళ్ల, మహానంది, న్యూస్‌టుడే: వంట చెరకు కోసం వెళ్లిన ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల, మహానంది మండలాల సరిహద్దు ప్రాంతంలోని పచ్చర్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరివెళ్ల మండలంలోని పచ్చర్లకు చెందిన మాజీ ఉప సర్పంచి షేక్‌ మెహరూన్‌బీ (45) మంగళవారం ఉదయం వంట చెరకు కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఇంటికి రాకపోవడంతో ఇద్దరు కుటుంబీకులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి గాలిస్తుండగా.. మెహరూన్‌బీ ఛాతీ, తల, కడుపు భాగాన్ని చిరుత తినేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వారు గట్టిగా కేకలేస్తూ కర్రలతో అక్కడికి వెళ్లేందుకు యత్నిస్తుండగా.. మెహరూన్‌బీ తల భాగాన్ని చిరుత లాక్కెళ్లిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని