ఏసీబీకి పట్టుబడిన వెల్దండ ఎస్సై

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ ఎస్సై రవి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబట్టారు.

Published : 26 Jun 2024 05:08 IST

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే: నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ ఎస్సై రవి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు పట్టుబట్టారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్‌ కథనం ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని తిలక్‌నగర్‌ చెందిన డేరంగుల వెంకటేశ్‌ ఇంట్లో ఈనెల 17న రాళ్లు పగులగొట్టేందుకు వినియోగించే మందుగుండు సామగ్రి 7 పెట్టెల జిలిటెన్‌ స్టిక్స్, 2 పెట్టెల డిటోనేటర్లను నిల్వ చేయగా వెల్దండ పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయంలో కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌ చేశారు. బాధితుడు వెంకటేశ్‌ ఈ నెల 19న ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సై సూచన మేరకు వెంకటేశ్‌ కల్వకుర్తి పట్టణానికి చెందిన అంబులెన్సు డ్రైవర్‌ విక్రమ్‌కు రూ.50వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదే సమయంలో వెల్దండ ఠాణాలో ఎస్సై రవిని అరెస్టు చేశామని అనిశా డీఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు