Srikakulam: రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్‌.. వాహనాలు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. 

Updated : 29 Jun 2024 16:08 IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించింది. సరకా ల్యాబొరేటరీస్‌లో రియాక్టర్‌ పేలడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకొని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని