Allagadda: ఆళ్లగడ్డలో తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి.. భార్య మృతి

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు.

Updated : 25 Jun 2024 20:19 IST

ఆళ్లగడ్డ: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం తెదేపా నేత ఏవీ భాస్కర్‌రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతి చెందగా, భాస్కర్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి భౌతికకాయాన్ని తెదేపా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పరిశీలించారు. ఘటనకు సంబంధించి పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని