Crime news: ప్రేమపెళ్లి విఫలం.. ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని యువకుడి ఆత్మహత్య!

ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది.

Updated : 03 Jul 2024 11:53 IST

అనంతపురం: ప్రేమపెళ్లి విఫలమైందంటూ మనస్తాపం చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాసుదత్త అనే యువకుడు తమ ఇంటికి సమీపంలో నివాసముంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ కలిసి ఇటీవల పెన్న అహోబిలంలో ఎవరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతి.. వాసుదత్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ప్రేమను నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన వాసుదత్త అనంతపురం శివారు కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలోని ఇంటికి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు