CBI: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై కేసు నమోదు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Updated : 30 Jun 2024 17:49 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ అక్రమ రవాణాకు సహకరించిన ముగ్గురు కస్టమ్స్‌ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన ఎ.శ్రీనివాసులు, పాత బోయిన్‌పల్లికి చెందిన పంకజ్‌ గౌతమ్‌, సికింద్రాబాద్‌ కానాజిగూడకు చెందిన పేరి చక్రపాణిలపై కేసులు నమోదు  చేశారు.

2023 మార్చి 16న శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ, భారతీయ కరెన్సీని CISF-CIW సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. రూ.4లక్షల భారతీయ కరెన్సీని తీసుకెళ్తున్న హైదరాబాద్‌ బహదూర్‌పురాకు చెందిన ప్రైవేటు వ్యక్తితో పాటు అతని కుమారుడి వద్ద రూ.2,93,425కి సమానమైన వివిధ దేశాల కరెన్సీని నోట్లు ఉన్నాయని సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నిందితులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు జరిపి కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు