Kurnool: బాలికపై లైంగిక వేధింపులు.. వైకాపా మాజీ ఎమ్మెల్యేకు 14 రోజుల రిమాండ్‌

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు.

Updated : 04 Jul 2024 22:52 IST

కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. మాజీ ఎమ్మెల్యేకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో గతంలో సుధాకర్‌ అసభ్యంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో కొద్దిరోజుల క్రితం సోషల్‌ మీడియాలో వైరల్‌  అయింది. ఈ ఘటనపై ఇటీవల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఉదయం కర్నూలులోని నివాసంలో ఉండగా పోలీసులు సుధాకర్‌ను అరెస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని