Zomato: జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు

Zomato: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటోకు రూ.9.5 కోట్ల జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. 

Published : 30 Jun 2024 19:58 IST

Zomato | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో (Zomato)కు అసిస్టెంట్‌ కమీషనర్‌ ఆఫ్‌ కమర్షియల్‌ టాక్సెస్‌ జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. సర్వీస్‌ ట్యాక్స్‌, పెనాల్టీ, వడ్డీతో కలిపి మొత్తం రూ.9.5 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొంది. ఈ విషయాన్ని కంపెనీ బీఎస్‌ఈ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. షోకాజ్ నోటీసుపై జొమాటో స్పందించింది. సంబంధిత పత్రాలు, న్యాయపరమైన పూర్వాపరాలతో వివరాలు సమర్పించినట్లు వెల్లడించింది. డిమాండ్‌ నోటీసు వల్ల కంపెనీ ఆర్థిక పరిస్థితిపై ఎటువంటి ప్రభావం ఉండదని ప్రకటించింది. దీనిపై సంబంధిత అథారిటీ ముందు అప్పీల్‌కు వెళతామని స్పష్టం చేసింది. అయితే జొమాటోకు జీఎస్‌టీ డిమాండ్‌ నోటీసు రావడం ఇదేం మొదటి సారి కాదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని