YouTube: యూట్యూబ్‌లో కొత్త ఫీచర్‌..డీప్‌ఫేక్‌ వీడియోల ఆటకట్టు

YouTube: డీప్‌ఫేక్‌ వీడియోలను అరికట్టేందుకు యూట్యూబ్ మరో అడుగు ముందుకు వేసింది. ఈ వీడియోలను తొలగించేందుకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

Published : 22 Jun 2024 17:32 IST

YouTube | ఇంటర్నెట్‌డెస్క్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) వినియోగం పెరిగిపోయింది. ప్రతి రంగంలోనూ ఈ సాంకేతికతను చాలా మంది దుర్వినియోగం చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు తమ వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో వచ్చే డీప్‌ఫేక్‌ కంటెంట్‌ను అరికట్టడటంలో భాగంగా యూట్యూబ్‌ (YouTube) ముందడుగువేసింది.

కొందరు కంటెంట్‌ క్రియేటర్లు తమ ఫాలోవర్లను ఆకట్టుకోవడంలో భాగంగా లేనిది ఉన్నట్టుగా.. ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నారు. దీంతో ఏది నిజమైన వీడియోనో.. ఏది ఏఐ సాయంతో రూపొందించిన వీడియోనో తెలుసుకోలేక తికమకపడుతున్నారు. వ్యక్తులకు తెలియకుండా వారి వాయిస్‌ను ఉపయోగించి కంటెంట్‌ను అందిస్తున్నారు. దీనికి చెక్‌పెట్టేందుకు  యూట్యూబ్‌ సరికొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. కంటెంట్‌ క్రియేటర్లు తమ వీడియోలో ఏఐని వినియోగిస్తుంటే ఆ విషయాన్ని యూజర్లకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొంది. తాజాగా మరికొన్ని ఫీచర్లు జోడించింది. వీటి సాయంతో వినియోగదారులు డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై రిపోర్ట్‌ చేయొచ్చు. 

ఇకపై లైవ్‌స్ట్రీమ్‌ ప్రారంభించాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఉండాల్సిందే..! ‘ఎక్స్‌’లో కీలక మార్పు

ఇకపై యూట్యూబ్‌లో మీ ఫొటో లేదా వాయిస్‌ని ఉపయోగించి రూపొందించిన కంటెంట్‌ కనిపిస్తే వెంటనే రిపోర్ట్‌ చేయొచ్చు. యూజర్ల అభ్యర్థన మేరకు ఆ వీడియోలను పరిశీలించి, కంటెంట్‌ వాస్తవానికి విరుద్దంగా ఉందా? అనే విషయాన్ని ధృవీకరించి సదరు వీడియోలను తొలగిస్తుంది. దీంతో యూజర్ల డీప్‌ఫేక్‌ వీడియోలను అరికట్టొచ్చని పేర్కొంది. యూజర్ల గోప్యతను పెంచడంలో భాగంగానే వీటిని తీసుకొచ్చినట్లు తన బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని