- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
ITR Filing: ఆదాయం ₹2.5లక్షలు లేకపోయినా..వీరు కచ్చితంగా ఐటీఆర్ సమర్పించాల్సిందే!
ITR Filing: ఆదాయం రూ.2.5 లక్షలు లేకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో కచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది....
ITR Filing: సాధారణంగా ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి దాటినప్పుడు లేదా మన ఆదాయంలో మూలం వద్దే పన్ను కోత ఉంటేనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని (ITR Filing) భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టం (IT Act)లోని సెక్షన్ 139 ఏయే సందర్భాల్లో ఐటీఆర్ (ITR) దాఖలు చేయాలో స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల్లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు కూడా చేసింది. మరి రిటర్నులు సమర్పించాల్సిన ఆ సందర్భాలేంటో చూద్దాం..!
☞ సాధారణ పన్ను మినహాయింపు పరిమితి దాటితే..
- వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు దాటిన సాధారణ పౌరులు
- 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్ల ఆదాయం రూ.3 లక్షలు
- 80 ఏళ్లు దాటిన వారి ఆదాయం రూ.5 లక్షలు దాటితే.. కచ్చితంగా ఐటీఆర్ దాఖలు చేయాలి.
- అయితే, ఆదాయాన్ని లెక్కించేటప్పుడు సెక్షన్ 80సీ (Section 80C) వంటి మినహాయింపులను పరిగణనలోకి తీసుకునే వెసులుబాటు ఉందని గమనించాలి.
☞ ఇతర దేశాల్లో ఎలాంటి ఆస్తులు ఉన్నా ఐటీఆర్ (ITR) తప్పనిసరిగా దాఖలు చేయాలి. ఏదైనా విదేశీ కంపెనీలో భాగస్వాములైనా.. లేదా దాంట్లో సైనింగ్ అథారిటీ ఉన్నా రిటర్నులు దాఖలు చేయాల్సిందే. లేదా ఏదైనా ఆస్తుల నుంచి ఆదాయం పొందుతున్నా రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది.
☞ ఒకటి లేదా ఎక్కువ బ్యాంకుల్లోని కరెంటు ఖాతాల్లో ఒక ఏడాదిలో రూ.కోటికి మించి నగదు డిపాజిట్ చేస్తే రిటర్నులు దాఖలు చేయాలి. అయితే, పోస్టాఫీసులోని కరెంటు ఖాతాలో చేసే డిపాజిట్‌ను మాత్రం సెక్షన్ 139లో ప్రత్యేకంగా పేర్కొనలేదు.
☞ క్రితం సంవత్సరంలో ఎవరైనా విదేశీయానం కోసం రూ.2 లక్షలు వెచ్చిస్తే వారు రిటర్నులు దాఖలు చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. అయితే, ఎవరు ప్రయాణిస్తున్నారన్న దానితో సంబంధం లేకుండా విదేశీయ ప్రయాణాల పేరిట ఖర్చు చేస్తే రిటర్నులు ఫైల్ చేయాల్సిందే.
☞ కిందటేడాదిలో కరెంటు బిల్లు రూ.1లక్ష దాటితే వారు రిటర్నులు దాఖలు చేయాల్సిందే.
☞ వ్యాపారంలో మొత్తం విక్రయాలు, టర్నోవర్ రూ.60 లక్షలు దాటితే ఐటీ రిటర్నులు సమర్పించాలి.
☞ ఏదైనా వృత్తి లేదా పని ద్వారా రూ.10 లక్షలకు మించిన ఆదాయం ఆర్జిస్తే ఐటీఆర్ దాఖలు చేయాలి.
☞ మూలం వద్ద పన్ను కోత (TDS), మూలం వద్ద పన్ను వసూలు (TCS) కలిపి మొత్తం ఒక ఏడాదిలో రూ.25,000 దాటితే కచ్చితంగా రిటర్నులు సమర్పించాలని ఐటీ నిబంధనలు చెబుతున్నాయి.
☞ సీనియర్ సిటిజన్ల (60 ఏళ్లు పైబడినవారు) టీడీఎస్, టీసీఎస్‌ల మొత్తం రూ.50,000 దాటితేనే ఐటీఆర్ దాఖలు చేయాలి.
☞ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాల్లో చేసే డిపాజిట్ మొత్తం ఏడాదిలో రూ.50 లక్షలు దాటితే కచ్చితంగా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
మరి మీరూ ఈ కేటగిరీల్లో ఉంటే మీ వార్షిక ఆర్జన రూ.2.5 లక్షలు లేకపోయినప్పటికీ.. వెంటనే ఐటీఆర్ దాఖలు చేయండి. జులై 31 ఆఖరు గడువు కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసా?
ITR filing 2023-24: ఐటీఆర్ దాఖలు చేసే సమయం దగ్గర పడటంతో అందరూ రిటర్నులు ఫైల్ చేయడం మొదలు పెట్టేశారు. అసలు రిటర్నులు ఫైల్ చేస్తే కలిగే ప్రయోజనాల గురించి తెలుసా? -
రిటర్నులు..ఇవన్నీ తెలుసుకున్నాకే
నిర్దేశించిన పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు.. నిర్ణీత శ్లాబుల్లో పన్ను చెల్లించాలి. నిబంధనల మేరకు ఆదాయపు పన్ను రిటర్నులనూ సమర్పించాలి. అప్పుడే ఆదాయం చట్టబద్ధమైనదిగా గుర్తింపు పొందుతుంది. -
మ్యూచువల్ ఫండ్లు యూనిట్ల లెక్క చూసుకున్నారా?
దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించేందుకు పెట్టుబడులు పెడుతుంటాం. ఇవన్నీ పూర్తిగా డిజిటల్లోనే ఉంటున్నాయి. -
పెట్టుబడుల్లో ఈ విషయాలు పట్టించుకోవద్దు
స్టాక్ మార్కెట్లు కొత్త జీవన కాలగరిష్ఠాలకు చేరుకున్నాయి. దీంతో చాలామంది పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో వస్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే మదుపు చేసిన వారు లాభాలను స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. -
ఇండెక్సేషన్ అంటే ఏంటి ? ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుంది?
Indexation: పెట్టుబడులు, కొనుగోలు ధరల విలువ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా తరిగిపోకుండా సర్దుబాటు చేసే పద్ధతే ఇండెక్సేషన్. ఇది పన్ను భారాన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం..! -
ప్రమాదంలో ఆర్థిక ధీమా
ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవడంతోపాటు, కొన్నిసార్లు శాశ్వత వైకల్యమూ సంభవిస్తుంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే మరణించే ఆస్కారమూ ఉంది. -
ఆరోగ్య బీమా.. టాపప్ చేస్తున్నారా?
వైద్య ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీన్ని తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా మారింది. మరోవైపు అధికంగా ఉన్న ప్రీమియం రేట్లు కలవరపెడుతున్నాయి. -
అత్యవసరంలో ఆదుకునేలా
అత్యవసరం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఈ పరిస్థితికి ఎల్లవేళలా సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని. ముఖ్యంగా ఆర్థిక అత్యవసరాలు కొన్నిసార్లు మానసికంగా ఆందోళనను కలిగిస్తాయి. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
ఆదాయ పన్ను రిటర్నులు.. మీకు ఏ ఫారం వర్తిస్తుందో తెలుసా?
ITR: పొరపాటున తప్పు ఫారాన్ని ఎంచుకుంటే ఆదాయపు పన్ను శాఖ దానిని ‘డిఫెక్టివ్ రిటర్ను’గా పరిగణించే ప్రమాదం ఉంది. -
మ్యూచువల్ ఫండ్లు మీ ఎంపిక సరైనదేనా?
స్టాక్ మార్కెట్లు కొత్త గరిష్ఠాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది మదుపరులు కొత్తగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
ఇంటికి ఇద్దాం.. బీమా రక్ష
కలల ఇంటిని కష్టపడి నిర్మించుకుంటాం. ఇది మనకు అతి పెద్ద పెట్టుబడి. ఇల్లు, ఇంట్లో ఉండే మనం, వస్తువులు సురక్షితంగా ఉండేలా అన్ని భద్రతా చర్యలూ తీసుకుంటాం. -
50 షేర్లలో పెట్టుబడి..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ఒక క్వాంట్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ క్వాంట్ ఫండ్ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 24 వరకూ అందుబాటులో ఉంటుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
గృహ రుణ దరఖాస్తుదారులూ... ఈ విషయాలు తెలుసుకోండి..
చాలా మంది వ్యక్తులు హోమ్ లోన్ ద్వారా తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రుణాన్ని తీసుకునే వారు ఏయే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. -
తెలుసుకుంటే.. ఆస్తి మీ వెంటే!
ఏ ఆస్తి అయినా కొనే ముందు మనం చూడాల్సిన మొట్ట మొదటి విషయం ఏంటంటే అమ్మే వారికి ఉన్న హక్కులు ఏంటని. ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
పదవీ విరమణ ప్రశాంతంగా సాగాలంటే
పదవీ విరమణ.. ఎన్నో ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత విశ్రాంతంగా ఉండే సమయం. ఈ కాలంలో ఆర్థికపరమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలం. దీనికోసం ఆర్జిస్తున్న సమయంలోనే కచ్చితమైన ప్రణాళికలు వేసుకోవాలి -
ఇంటి రుణం తొందరగా తీర్చేద్దాం
సొంతిల్లు.. ఎంతో మంది కల. అత్యంత ఖరీదైన పెట్టుబడుల్లో ఒకటి. దీన్ని నిజం చేసుకునే క్రమంలో గృహరుణం చాలామందికి తప్పనిసరి. కొంత కాలంగా రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ, బ్యాంకులు గృహరుణ వడ్డీ రేటును సవరిస్తూ ఉన్నాయి. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులివే..
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
చిన్నారుల కలలు నిజం అయ్యేలా..
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లలకు బడిలో చేరింది మొదలు.. ఉన్నత విద్య వరకూ అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా ఇదొక సవాలు లాంటిదే. చిన్నారులు వృద్ధిలోకి రావడానికి తల్లిదండ్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. సిలబస్ ఇదే..
-
పింఛన్ల పంపిణీలో రికార్డు.. ఏపీలో ఒక్క రోజే 95% పూర్తి
-
రాహుల్ VS రాజ్‌నాథ్.. అగ్నిపథ్‌పై మాటల తూటాలు
-
‘కల్కి 2898 ఏడీ’ సాధించిన టాప్-10 బాక్సాఫీస్ రికార్డులివే!
-
జియో, ఎయిర్టెల్ కొత్త టారిఫ్‌లు.. వార్షిక రీఛార్జికి ‘ప్లాన్’ చేస్తున్నారా?
-
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చేశాయ్..